VIDEO: పుంగనూరులో శ్రీకృష్ణదేవరాయుల వర్ధంతి

VIDEO: పుంగనూరులో శ్రీకృష్ణదేవరాయుల వర్ధంతి

CTR: శ్రీకృష్ణ దేవరాయుల 496వ వర్ధంతిని శుక్రవారం పుంగనూరులో బలిజ కులస్తులు ఘనంగా నిర్వహించారు. భీమగానిపల్లి కూడలిలో ఏర్పాటు చేసిన దేవరాయుల వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన ప్రజా పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రాయల్, నాన బాలమణి, రాఘవ రాయల్, జనార్ధన్ రాయల్ పాల్గొన్నారు.