గజ్వేల్ జిల్లా ఆసుపత్రిలో 'ల్యాబ్ టెక్నీషియన్స్ డే'
SDPT: గజ్వేల్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో అంతర్జాతీయ ల్యాబ్ టెక్నీషియన్స్ డే వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ల్యాబ్ టెక్నీషియన్ మహేందర్ ఆధ్వర్యంలో ఆసుపత్రి సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రోగ నిర్ధారణలో ల్యాబ్ టెక్నీషియన్ల పాత్ర ఎంతో కీలకమని, రోగులకు వేగవంతమైన, ఖచ్చితమైన వైద్య సేవలు అందించడంలో తాము నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.