'రోడ్డు ప్రమాదాల పట్ల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి'
NDL: రోడ్డు ప్రమాదాల పట్ల వాహన డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు బీసీ రాజారెడ్డి అన్నారు. బనగానపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఇవాళ రోడ్డు ప్రమాదాలపై బీసీ రాజారెడ్డి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అతివేగం ప్రమాదకరం మృత్యువు మీ ముందే అనే నినాదంతో ఉన్న పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.