ట్రంప్ అణు వ్యాఖ్యలపై స్పందించిన భారత్
పాకిస్తాన్ రహస్యంగా అణ్వాయుధాలను పరీక్షిస్తోందంటూ ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ట్రంప్ ప్రకటనలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా, పాకిస్తాన్‌కు రహస్య అణుపరీక్షలు నిర్వహించడం అలవాటేనని భారత్ అభిప్రాయపడింది.