నడిరోడ్డుపై కత్తితో పొడిచి హత్య
ELR: ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన భీమడోలు మండలం పూళ్ళ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పాతాళ నాగరాజుకు, కొండ్రు ఇస్సాకు అనే వ్యక్తికి పాత కక్షలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇస్సాకు అతని కుటుంబానికి చెందిన మరో వ్యక్తి సాయంతో నాగరాజుపై కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణం అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.