బందోబస్తు పటిష్టం చేయండి: డీఎస్పీ

ప.గో: త్వరలో జరగనున్న MLC ఎన్నికల దృష్ట్యా బోర్డర్ చెక్ పోస్టుల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కొవ్వూరు DSP జీ. దేవకుమార్ ఆదేశించారు. మండలంలోని, జగన్నాధపురం చెక్ పోస్టును బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ.. సరైన పత్రాలు, ఆధారాలు లేని నగదు, ఇతర వస్తువులు తరలించే అవకాశం ఉందన్నారు. సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండి తనిఖీ చేయాలన్నారు.