మే 9న జాతీయ లోక్ ఆదాలత్
KRNL: జిల్లాలో మే 9న జాతీయ లోక్ ఆదాలత్ జరగనుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి తెలిపారు. నగరంలోని న్యాయ సేవా సదన్‌లో మంగళవారం ఆయన పలు ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రైవేటు సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి సారించి రాజీ మార్గంలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు.