రాయచోటిలో పెరిగిన మాంసం ధరలు..!

రాయచోటిలో పెరిగిన మాంసం ధరలు..!

అన్నమయ్య: రాయచోటిలో మాంసం ధరలు పెరిగాయి. చికెన్ కిలో ధర రూ.240 నుంచి రూ.270 వరకు పెరగగా, మటన్ ధర కిలోకు రూ.850గా కొనసాగుతోంది. చేపల ధరలు కిలోకు రూ.100 నుంచి రూ.300 వరకు ఉన్నాయి. ఆదివారం కావడంతో చికెన్ దుకాణాల వద్ద కొనుగోలు దారులు భారీగా తరలివచ్చారు. ధరలు పెరిగినా వినియోగదారుల రద్దీ మాత్రం తగ్గలేదు. వ్యాపారులు డిమాండ్ పెరగడమే ధరల పెరుగుదలకు కారణమని కొనుగోలు దారులు పేర్కొన్నారు.