జిల్లాలో మహిళా దొంగలు అరెస్ట్

కర్నూల్: ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కే ప్రయాణికుల వద్ద బంగారు గొలుసులు, పర్సులను దొంగిలిస్తున్న మహిళా దొంగలు షేక్ ఖాజాబీ, షేక్ ఫరీదాను సోమవారం అరెస్టు చేసినట్లు జిల్లా 4వ పట్టణ సీఐ విక్రమ సింహ తెలిపారు. ఈనెల 13న అలంపూర్‌కు చెందిన విమలమ్మ పర్సు దొంగిలించినట్లు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీ బస్టాండ్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహిళలను అరెస్టు చేశామన్నారు.