VIDEO: గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం

HYD: గోల్కొండ కోటలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. వేడుకల సందర్భంగా కళాకారులతో కళానృత్యాలు, 31 విభాగాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, డీజీపీ జితేందర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.