శ్రీ బాల బాలాజీ నిత్యాన్నదాన ట్రస్ట్‌కు విరాళం
కోనసీమ: అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో కడియం గ్రామానికి చెందిన సురింది వీర వెంకట్ రావు, కుమారి దంపతులు స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.1,01,111 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. వారికి ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేసి, స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించారు.