మట్కా స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు

మట్కా స్థావరంపై పోలీసుల మెరుపు దాడులు

ATP: గుత్తి పట్టణ శివారులో ఇవాళ సాయంత్రం మట్కా స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. సీఐ రామారావు మాట్లాడుతూ.. మట్కా రాస్తున్నారని తమకు రాబడిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు చేశామన్నారు. అందులో భాగంగా మట్కా రాస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 52,000 నగదు, మట్కా చీటీలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.