తడ్కల్ సబ్‌స్టేషన్ ఎదుట రైతులు ధర్నా
SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో రైతులకు సమయానికి విద్యుత్ సరఫరా చేయడంలో విద్యుత్ అధికారులు విఫలమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి విద్యుత్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది తెలియని పరిస్థితులు, విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని సబ్ స్టేషన్ ఎదుట రైతులు ధర్నా చేశారు.