ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైద్య శిబిరం

NLG: నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పానగల్ చికిత్స కేంద్ర సహకారంతో వైద్య శిబిరం నిర్వహించారు. హెల్త్ ప్రొఫైల్, వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సిబ్బంది సూచించారు. డాక్టర్ తపసం, డాక్టర్ పసుపుల, ప్రిన్సిపల్,ఎన్ఎస్ఎస్ ఛైర్మన్ ప్రొఫెసర్ శ్రీనివాసరాజు పాల్గొన్నారు.