VIDEO: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

VIDEO: ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

W.G: నరసాపురం ఏరియా ఆసుపత్రిలో ఇవాళ విషాద ఘటన చోటుచేసుకుంది. పెదమైన వాని లంక గ్రామానికి చెందిన సంకరపు అరుంధతి(38) ఇటీవల గ్రామంలో జరిగిన వివాదంలో గాయపడి ఈనెల 16న ఆసుపత్రిలో చేరింది. చికిత్స పొందుతున్న ఆమె ఆసుపత్రిలోని మరుగుదొడ్డిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.