తామాడలో పగలే విద్యుత్ వెలుగులు

SKLM: లావేరు మండలం తామాడ గ్రామంలో పగటిపూట వీధి దీపాలు వెలుగుతూ కనిపిస్తున్నాయి. దీనిపై గ్రామస్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని అంటున్నారు. పగటిపూట వీధి దీపాలు వెలగడంతో పంచాయతీకి విద్యుత్ భారం అధికమవుతుందని తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.