'నైపుణ్యం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి'

'నైపుణ్యం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలి'

PDPL: పెద్దపల్లి మండలం నిమ్మనపల్లిలోని ప్రైమరీ స్కూల్‌ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 4వ తరగతి విద్యార్థుల ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ పరిశీలించారు. విద్యార్థుల నైపుణ్యం పెరిగేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పిల్లలు బాగా చదువుతున్నారని, చదవడం, రాయడం వంటి ప్రాథమిక విద్య ప్రమాణాలను మెరుగుపరచడంపై దృష్టి సాధించాలన్నారు.