'విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

KMR: విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆగష్టు 13వ తేదీతో ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్య నివారణపై ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడవద్దని తెలిపారు.