రోడ్లు కుంటల్లా మారడంతో ప్రజలకు ఇబ్బందులు

అన్నమయ్య: చిట్వేల్ పట్టణంలో వర్షాల కారణంగా పలు వీధులు కుంటల్లా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజ్ సమస్యలతో బ్రాహ్మణ వీధి, సింగనమల వీధి, చాకలి వీధుల్లో నిల్వ నీరు పాదచారులకు ప్రమాదంగా మారింది. శాశ్వత పరిష్కారం కోసం స్థానికులు అధికారులను సోమవారం డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.