రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

NZB: రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలిపారు. నవీపేట్ మండలం జలాల్‌పూర్ వద్ద ట్రాక్టర్, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ వెంకటేశ్వర్లు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా ఆటో డ్రైవర్ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించారు.