స్లాబ్ స్థాయిలోనే నిలిచిపోయిన అంగన్వాడీ భవనం
VZM: మెరకముడిదాం ఎస్సీ కాలనీలో అంగన్వాడీ భవనం నిర్మాణ దశలోనే నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. అంగన్వాడీ భవనం నిర్మాణ దశలోని ఆగిపోవడంతో భవనం లోపల పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. సంబంధిత అధికారులు స్పందించి నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనాన్ని పూర్తి చేయాలని కాలనీవాసులు, అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.