చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

NZB: నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు 6వ టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపారు. అర్సపల్లి ప్రాంతంలోని NN ఫంక్షన్ హాల్ సమీపంలో అపస్మారక స్థితిలో ఓ వ్యక్తి ఉండడంతో చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈరోజు అతడు మృతి చెందాడు. మృతుడిని ఎవరైనా గుర్తుపడితే తమను సంప్రదించాలని ఎస్సై కోరారు.