కాంగ్రెస్‌కు షాక్.. అగ్రనేతల ప్రాంతాల్లో చుక్కెదురు..!
NRML: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు అయిన వేణుగోపాల చారి, శ్రీహరి రావు, ఇంద్రకరణ్ రెడ్డి నివసిస్తున్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీకి బలమైన కేడర్ ఉన్నట్టుగా భావించిన ఈ ప్రాంతాల్లో ఓటమి ఎదురుకావడం నాయకత్వాన్ని ఆలోచనలో పడేసింది.