కొనసాగుతున్న జైస్వాల్ ‘గ్రౌండ్’ రికార్డ్

కొనసాగుతున్న జైస్వాల్ ‘గ్రౌండ్’ రికార్డ్

భారత యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ టెస్టుల్లో తన అరుదైన రికార్డు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో తన 28వ టెస్టు ఆడుతున్న అతను ఇప్పటివరకు ఒకే మైదానంలో రెండో మ్యాచ్ ఆడలేదు. అతని 28 టెస్టులు 28 వేదికల్లో జరిగాయి. ఇది ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కూ సాధ్యం కాని ఫీట్. జైస్వాల్ భారత్‌లోని 14, ఇంగ్లండ్ 5, ఆస్ట్రేలియా 5, వెస్టిండీస్ 2, సౌతాఫ్రికాలోని 2 మైదానాల్లో ఆడాడు.