వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా దరఖాస్తులు

వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా దరఖాస్తులు

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ గడువు ముగిసింది. దాదాపు 1.80 లక్షల టోకెన్ల కోసం 24 లక్షల మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి, డిసెంబర్ 31 ద్వాదశి, జనవరి 1కి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. డిసెంబరు 2న నిర్వహించే ఈ-డిప్ లాటరీలో ఎంపికైన భక్తులకు టీటీడీ టోకెన్లు కేటాయిస్తుంది.