నరసింహులపేట ఎంపీడీవోగా అంజలి బాధ్యతలు
MHBD: నర్సింహులపేట ఎంపీడీవోగా అంజలి బాధ్యతలు స్వీకరించారు. మండల కేంద్రంలోని తన కార్యాలయంలో సోమవారం ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మండల అధికారులు, ప్రజలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మండలంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకుని వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.