జిల్లాలో నిరంతరం పర్యవేక్షణ: SP

MBNR: జల్లాలోని కోయిలకొండ X రోడ్ వద్ద గోవుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన చెక్ పోస్టును గురువారం రాత్రి SP డి. జానకి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తగిన సూచనలు చేశారు. జిల్లాలో గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దుల్లో 5 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. 24 గంటలూ పోలీసుల పర్యవేక్షణలో ఈ సరిహద్దులు ఉంటాయన్నారు.