5K రన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద ఇవాళ ఉదయం 5K స్పెషల్ రన్‌ను ఎమ్మెల్యే విజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. చదలవాడ గ్రామం నుంచి నాగులుప్పలపాడు బస్టాండ్ వరకు 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇటువంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని అందిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు అందరూ పాల్గొన్నారు.