వెంకటగిరి పోలేరమ్మ జాతర ఎప్పుడంటే?

TPT: ఎంతో చరిత్ర కలిగిన వెంకటగిరి పోలేరమ్మ జాతర మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఏటా వినాయక చవితి తర్వాత వచ్చే మూడో బుధ, గురువారాల్లో జాతర నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈసారి సెప్టెంబర్ 10, 11వ తేదీల్లో అమ్మవారి జాతర జరగనుంది. 7వ తేదీ ఘటోత్సవం నిర్వహిస్తారు. 10వ తేదీ అమ్మవారి ప్రతిమ సిద్ధం చేస్తారు. 11వ తేదీ సాయంత్రం అమ్మవారి నిమజ్జనంతో జాతర ముగుస్తుంది.