పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ

తూ.గో: అనపర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు, పంచాయతీ సిబ్బందికి సంక్రాంతి సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గురువారం నూతన వస్త్రాలను, చెప్పులు, స్వీట్ బాక్స్, తదితర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలను భోగిమంట వెలిగించి ఎమ్మెల్యే ప్రారంభించారు.