దేవాలయానికి ఆవును దానం చేసిన కుటుంబం

NTR: నందిగామలో కుమారస్వామి దేవాలయంలో ఆవును వేములపల్లి గ్రామానికి చెందిన కోయ గిరిధర్, విజయ కుమారి కుటుంబం సోమవారం దానం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు లక్ష్మణాచార్యులు మాట్లాడుతూ.. ఆవును దానం చేయడం హిందువులు అనుసరించే గొప్ప ఆచారం, దేవాలయాలలోని ఇతర నైవేద్యాల కంటే ఆవు దానం గొప్పదని అన్నారు.