వెల్దుర్తిలో కోతులను పట్టిస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి.!

వెల్దుర్తిలో కోతులను పట్టిస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి.!

MDK: వెల్దుర్తి మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో సర్పంచ్‌ అభ్యర్థి దండం ఆదర్శ్‌ కోతులు పట్టేవారిని ఏర్పాటు చేశారు. వీరు రెండు రోజులు ఆహార ధాన్యం వేసి మూడో రోజున కోతులను బోనులో బంధించి, లెక్కించిన అనంతరం అటవీ ప్రాంతంలో వదిలి పెడతామని తెలిపారు. ఈ చర్యతోనైనా కోతుల సమస్య పరిష్కారం అవుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.