వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

PLD: అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం అమలు జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇవాళ సచివాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పథకాలపై సమీక్ష నిర్వహించి, కీలక దిశానిర్దేశాలు ఇచ్చారు. నరసరావుపేట కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ - అరుణ్ బాబు ఈ సమావేశంలో పాల్గొన్నారు.