జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణలో కొత్త రికార్డు

జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణలో కొత్త రికార్డు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొత్తం 2.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని జేసీ నవీన్ తెలిపారు. ఖరీఫ్ 2025-26 సీజన్‌లో ధాన్యం సేకరణ కోసం 287 రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఏడాది ఇదే రోజు వరకు 1,82,405 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 2,46,473 మెట్రిక్ టన్నులు సేకరించారు. మొత్తం 29,668 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, 48 గంటల్లోనే నగదు జమ చేసినట్లు తెలిపారు.