బాలానగర్ చెరువులో పడ ఓ వ్యక్తి మృతి
MBNR: ప్రమాదవశత్తు చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బాలానగర్ మండల కేంద్రం సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఎస్సై లెనిన్ వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం సుల్తానపల్లి గ్రామానికి చెందిన బాలరాజు (26) బాలానగర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువు వద్ద స్నానానికి వెళ్లి ప్రమాదవశత్తు నీటిలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు.