గుండెపోటుతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి
KMM: గుండెపోటుతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందిన ఘటన బుధవారం సింగరేణి మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. టేకులగూడెంకు చెందిన మూతి శ్రీనివాసరావు సీఆర్పిఎఫ్ జవాన్‌గా చర్లలో విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు వీధిలో ఉండగానే గుండెపోటు గురై మృతి చెందారు. కాగా, శ్రీనివాసరావు అంత్యక్రియలను సీఆర్పీఎఫ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు.