భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ స్పీకర్

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ స్పీకర్

SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారిని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకులు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మండపంలో వేద పండితులు, ఆలయ అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రం లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.