రికార్డ్ ధర పలికిన మేకల సంత వేలంపాట..!
NZB: నవీపేట మేకల సంత వేలంపాట గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధర పలికిందని నిర్వాహకులు తెలిపారు. జీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ పాటలో మొత్తం 159 మంది పోటీ పడగా సిరాజుద్దీన్ అనే వ్యక్తి రూ.1.2 కోట్లకు దక్కించుకున్నాడు. కాగా, గతేడాది రూ. 61 లక్షలు పలికింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేఖ, ఉప సర్పంచి నవీన్ రాజ్, కార్యదర్శి రవీంద్ర నాయక్, పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు