కౌలాస్‌నాలా రెండు గేట్లు ఎత్తివేత

KMR: కౌలాస్‌నాల ప్రాజెక్టు గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. శుక్రవారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్ట్‌లోకి 1,069 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో ప్రాజెక్ట్ రెండు గేట్లను ఎత్తి దిగువకు 2,180 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో నదీ పరీవాహక ప్రాంతం ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.