VIDEO: ముక్తేశ్వరం కాజ్‌వే పై కొనసాగుతున్న వరద ఉధృతి

కోనసీమ: అయినవిల్లి మండలం పరిధిలోని ముక్తేశ్వరం-ఎదురుబిడియం కాజ్వే వద్ద గోదావరి వరద ఉధృతి ఆదివారం కూడా కొనసాగింది. ధవలేశ్వరం వద్ద వరద తగ్గుముఖం పట్టినప్పటికీ, ముక్తేశ్వరం కాజ్ వే ఇంకా వరద ముంపులోనే ఉంది. దీంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రానికి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.