ఎస్సీ, ఎస్టీ గృహాలకు ‘సౌర’ వెలుగులు
VSP: పీఎం సూర్య ఘర్ పథకం కింద జిల్లాలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు సోలార్ ప్లాంట్లు ఏర్పాటు వేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా చినవాల్తేరులో ఒక గృహంపై ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ మాట్లాడుతూ.... 3,595 మందికి 7.19 మెగావాట్ల ప్లాంట్లు కేటాయించామని తెలిపారు.