48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ
PDPL: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వానాకాలం 2025 పంటను సజావుగా కొనుగోలు చేయాలంటే, ధాన్యాన్ని 17% తేమ శాతం వరకు ఆరబెట్టి, నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలిస్తామన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు.