ఈనెల 20నుంచి దూరవిద్యా పీజీ సైన్స్ ఎగ్జామ్స్

వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో దూరవిద్యాకేంద్రం పీజీ సైన్స్ కోర్సుల మొదటి సంవత్సరం పరీక్షలు ఈనెల 20వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారులు తెలిపారు. ఎమ్మెస్సీ బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ మొదటి ఏడాది పరీక్షలు ఈనెల 20,22,26,28 తేదీల్లో నిర్వహించనున్నామన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సా. 5గం.వరకు పరీక్షలు నిర్వహిస్తారు.