ప్రతీకార దాడులు కొనసాగుతాయి: ఇరాన్
అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దురాక్రమణకు.. వారు పశ్చాత్తాప్పడేవరకు తమ ప్రతీకార దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడం తమ మొదటి ప్రాధాన్యమని వెల్లడించారు. హార్మూజ్ జలసంధిని మూసివేయడంతో సహా తాము తీసుకున్న చర్యలన్నీ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే ఉన్నాయని స్పష్టం చేశారు.