జిల్లా కలెక్టర్‌ను ఆహ్వానించిన కాణిపాకం ఈవో

CTR: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను ఆలయ ఈవో పెంచల కిషోర్ ఆహ్వాన పత్రిక అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ ఈవో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రికను, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా స్వామి వారిని దర్శించుకునేలా అన్ని చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.