బాలలపై లైంగిక దాడి నివారణపై శిక్షణ
KDP: అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం బాలలపై లైంగిక దాడి నివారణపై మండల స్థాయి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ హామీద బేగం మాట్లాడుతూ.. బాలల లైంగిక దాడి కేసుల్లో ఫోరెన్సిక్ పరీక్షలు, మెడికో లీగల్ రిపోర్టుల ప్రాముఖ్యత, ఫోక్సో చట్టం కింద వైద్యుల బాధ్యతలు, ఆరోగ్య కేంద్రాలు అనుసరించాల్సిన ప్రోటోకాల్స్‌ను వివరించారు.