బస్సుల కొరత.. ప్రయాణికులకు ఇబ్బంది
KRNL: ప్రధాని నరేంద్ర మోదీ సభకు ఆర్టీసీ బస్సులు తరలివెళ్లడంతో కోడుమూరు బస్టాండ్‌లో బస్సుల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు సమయానికి అందుబాటులో లేకపోవడంతో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారు బస్టాండ్ వెలుపల ఆటోలను, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.