అద్వాన రోడ్డుతో అవస్థలు

అద్వాన రోడ్డుతో అవస్థలు

KRNL: ఆస్పరి మండలం తగలగళ్ళు గ్రామం నుండి యాటికల్ గ్రామానికి ఈ రోడ్డు గుండా వెళ్లాలంటే నరకం చూస్తున్నామని స్థానికులు వాపోయారు. వర్షం వచ్చిందంటే ఈ రోడ్డు గుంతలు పడి వర్షం నీళ్లు ఆగి రోడ్డు బురదగా మారడంతో ఇబ్బందికరంగా మారిందని, అధికారులు స్పందించి గ్రామాలకు రాకపోకలు సాగించడానికి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని జనసేన మండల కార్యదర్శి జగన్నాథం తెలిపారు.