ఆ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్..!
HYD: నగరంలోని విప్రో జంక్షన్ నుంచి ఇన్ఫోసిస్ వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లు వాహనదారులు తెలిపారు. దీంతో రెండు కిలోమీటర్ల ప్రయాణం సుమారు అర్ధ గంట సమయం పడుతుందని పేర్కొన్నారు. రహదారిపై ఓ వాహనం బ్రేక్ డౌన్ కారణంగా ఈ సమస్య ఏర్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. వీలుంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచిస్తున్నారు.