అల్వాల్‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్

అల్వాల్‌లో పర్యటించిన మాజీ కార్పొరేటర్

MDCL: అల్వాల్ సర్కిల్ చిన్నరాయుని చెరువులో గుర్రపుడెక్క (హైసింథ్) తొలగింపు పనులను మంగళవారం మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. చెరువును పూర్తిగా శుభ్రం చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం ఓల్డ్ అల్వాల్ రామాలయం జంక్షన్ వద్ద వాహనాలు వేగంగా వెళ్లడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికుల భద్రత కోసం స్వంత ఖర్చుతో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు.